Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి, వంగ‌వీటి మిత్రులు క‌లిశారు... చ‌క్క‌గా మాట్లాడుకున్నారు!

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (10:16 IST)
కృష్ణా జిల్లా గుడివాడ కాపు నేత, వైసీపీ నాయకుడు పాలేటి చంటి మనవడి పుట్టిన రోజు వేడుకలో ఇద్ద‌రు హేమాహేమీలు క‌లిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. చ‌క్క‌గా కూర్కొని మాట్టాడుకున్నారు. వీరిద్ద‌రి క‌ల‌యిక చూసి, అంద‌రి దృష్టి వారిపైనే నిలిచింది. వారే మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. 
 
తెలుగుదేశంలో చిర‌కాలం ఉండి, చంద్ర‌బాబును తీవ్రంగా ద్వేషించి, వైసీపీకి జంప్ అయిన కొడాలి నాని ఇపుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రిగా, కీల‌క వ‌ర్గానికి నేత‌గా కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌పై తాజాగా గుడివాడ అసెంబ్లీ బ‌రిలోకి వంగ‌వీటి మోహ‌న రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధా దిగుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఊహాగానాలు వెలువ‌డిన నేప‌థ్యంలో వీరిద్ద‌రి క‌ల‌యిక ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. 
 
2024లో గుడివాడ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి రాదా సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. గుడివాడలోని కాపు సామాజికవర్గం నేతలతో రాధా వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు స‌మాచారం. గుడివాడలోని కాపు సామాజిక వర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంభందాలున్నాయి. దీనితో అంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాత సన్నిహితులతో  తాను గుడివాడ నుంచి పోటీ చేస్తాననే సంకేతాల‌ను వంగవీటి రాధా ఇచ్చిన‌ట్లు చెపుతున్నారు. 
 
గుడివాడ గడ్డపై నానిని మట్టికరిపిస్తాన‌ని సన్నిహితులతో వంగవీటి రాధా అంటున్న‌ట్లు తెలుస్తోంది. పైగా, ఇప్ప‌ట్లో టిడిపిని వీడే యోచన లేదు అని, ఆయ‌న‌ త‌న సన్నిహితులకు స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. తాను రాజకీయాల్లో తినాల్సిన ఎదురు దెబ్బలన్నీ తిన్నాన‌ని, నా నుంచి ఇకపై పరిణితితో కూడిన రాజకీయాలు చూస్తార‌ని, రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడమే నా లక్ష్యం అని వంగ‌వీటి రాధా చెపుతున్నార‌ట‌. బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా వంగవీటి కుటుంబం నిలిచింద‌ని, త‌న‌ను నమ్మిన, నమ్ముకున్న వారి కోసం ఎంత దాకా వెళ్ళేందుకైనా సిద్దం అని సన్నిహితులకు వంగ‌వీటి రాధా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇలాంటి స‌మ‌యంలో మంత్రి కొడాలి నాని, వంగ‌వీటి రాధా క‌ల‌యిక అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే వారిద్ద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకున్నా, వారి మ‌న‌సులోని భావాలు ఏంటి అనేది ఇపుడు ప్ర‌శ్నార్ధ‌కం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments