Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని పార్టీలకు బుద్ది చెప్పాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్

Advertiesment
కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని పార్టీలకు బుద్ది చెప్పాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:45 IST)
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సియం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

శనివారం పెద్దవంగర టిఆర్ఎస్ మండల పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలు, ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంధర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులుగా ఈదురు అయిలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
 
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్...
* గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు.. ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపు.
* కరోనా వల్ల దెబ్బ తిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుతం పురోభివృద్ధి దిశగా పయనిస్తుంది.
* పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి. 
* అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ..  దేశంలోనే ఆదర్శ సియంగా కేసీఆర్ నిలిచారు.
 * కళ్యాణలక్ష్మి, షాధీముభారక్, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచారు. 
* కరోనా కష్టకాలంలోనూ సంకేమ ఫలాలు అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.
* సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందజేసి, వ్యవసాయానికి 24గం.ల విద్యుత్, పంట పెట్టుబడి సహాయాన్ని అందజేసి రైతులకు అండగా నిలిచిన మహానీయుడు సియం కేసీఆర్. 
* దళితబంధుతో పాటు విడుతల వారిగా అన్ని వర్గాలకు ఆర్థిక సహాయం.
 * ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరిగింది.
 * బిజేపి బోగస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. 
* జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు జమచేస్తామన్న హామీని తుంగలో తొక్కింది.
* కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని పార్టీలకు బుద్ది చెప్పాలి.
* కరోనా కాలంలో ప్రజలకు కంటికి రెప్పలా కాపాడింది టిఆర్ఎస్ ప్రభుత్వం.
* రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు.
* రైతుల వ్యతిరేకి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.
* రైతులు పండించిన దొడ్డు ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తూ.. రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
* కేంద్రాన్ని నిలదీసేందుకు ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన.
* రైతులు రాబోయే యాసంగిలో సన్న రకాలను పండించాలి.
* వరితో పాటు.. ఇతర పంటలను రైతులు సాగు చేయాలి.
* నూతన వ్యవసాయం విధానం వైపు రైతులు మల్లాలని పిలుపు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నార్కోటిక్స్ తో ఎటువంటి ప్రమాదమూ లేదు: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి