ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులంతా త్వరలోనే మంత్రులు కాబోతున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. అధికారంలో రాగానే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గ మార్పులు చేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు.
ఇప్పుడు ఆ సమయం రానేవచ్చింది. త్వరలో ఉన్న మంత్రుల స్థానాల్లో కొత్త మంత్రులు రాబోతున్నారని తెలుస్తుంది. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్త వారిని తీసుకుంటారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే సీఎం జగన్‌తో చెప్పానని మంత్రి బాలినేని వెల్లడించారు.
తన మంత్రి పదవి పోయినా బాధపడేది, భయపడేది లేదని మంత్రి బాలినేని అన్నారు. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.