Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వచ్చే వీఐపీలకు ఉపరాష్ట్రపతి సూచన... ఏంటది?

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:31 IST)
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు. 
 
ఆయన మంగళవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకున్న వెంకటేశ్వర స్వామి మీడియాతో మాట్లాడారు. ఒకసాధారణ పౌరుడిగానే స్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ.. వెంకన్న భక్తులు పెరుగుతున్నారని చెప్పిన వెంకయ్య.. వారందరికి దర్శనం అవకాశం సులభంగా కలగాలన్నారు.
 
వీఐపీలుగా చెలామణి అయ్యే నాయకులు పదే పదే తిరుమలకురావడం తగ్గించాలని కోరారు. స్వామి దర్శనానికి వీఐపీలు సంవత్సరానికి ఒకసారి వస్తే మిగతా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం సులభంగా కలుగుతుందన్నారు. ఇదే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ అధికారులకు చెప్పానన్నారు. మరొకరు ఇబ్బంది పడుతూ మనం సంతోషంగా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదన్నారు. 
 
కాగా, ఉపరాష్ట్రపతిగా మహాద్వారం నుంచి దర్శనానికి వెళ్ళాల్సి ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామి దర్శనానికి వెళ్లడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. క్యూలైన్‍లోనే వెళ్లి దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. వేంకటేశుడి ముందు అందరూ సమానులే, సామాన్యులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments