Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (10:51 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఈ స్థానం నుంచి మేకపాటి గౌతంరెడ్డి సతీమణి శ్రీకీర్తిని బరిలోకి దించాలని వైకాపా అధిష్టానం భావిస్తుంది. కానీ, ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మేకపాటు కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
ఒకవేళ ఉప ఎన్నికల్లో మేకపాటి శ్రీకీర్తి పోటీ చేసిన పక్షంలో పోటీ నుంచి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు.. జనసేన, బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సివుంది. 
 
ఈ ఎన్నికల్లో వైకాపా కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న ఆచారం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తుంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న ఆచారాన్ని టీడీపీ పాటిస్తూ వస్తుంది. 
 
ఆత్మకూరు విషయంలోనూ ఇదే నిర్ణయాన్ని అనుసరించాలని భావిస్తుంది. మరోవైపు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments