Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్కార్ 2022: భార్యపై కామెంట్లు.. క్రిస్ రాక్ చెంపఛెల్లుమంది.. వెనక్కి తీసుకుంటారా? (వీడియో)

Advertiesment
ఆస్కార్ 2022: భార్యపై కామెంట్లు.. క్రిస్ రాక్ చెంపఛెల్లుమంది.. వెనక్కి తీసుకుంటారా? (వీడియో)
, సోమవారం, 28 మార్చి 2022 (17:46 IST)
Will Smith
అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రస్తుతం ఓ వివాదానికి దారితీసింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులతో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఒక పిచ్చి పని చేసి వార్తలకెక్కాడు.
 
ఆస్కార్ అవార్డ్స్ షోను హోస్ట్ చేస్తున్న క్రిస్ రాక్, విల్ భార్య జాడా పింకెట్ స్మిత్‌పై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఈ మాటలను విన్న విల్ ముందు సరదాగానే తీసుకున్నా ఈ తర్వాత జాడా నొచ్చుకుందని భావించి నేరుగా ఆస్కార్ స్టేజి మీదకి వెళ్లి హోస్ట్‌ను లాగిపెట్టి ఒక్కటి పీకాడు. 
 
దీంతో జాడాతో సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. జాడా పింకెట్‌పై కుల్లు జోకులు వేశాడు. అంతే "నా భార్య పేరుని కూడా నువ్వు పలకొద్దు" అంటూ కోపంతో గట్టిగట్టిగా అరుస్తూ స్టేజి మీద నుండి కిందకు వచ్చేసాడు విల్. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని క్రిస్ ఆస్కార్ అవార్డ్స్ షోను కంటిన్యూ చేసాడు.
 
ఈ సంఘటన జరిగిన కొద్దీ నిమిషాలకే, కింగ్ రిచర్డ్ సినిమాకుగానూ, విల్ స్మిత్ ఉత్తమనటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని పొందటం విశేషం. తాను చేసిన పిచ్చి పనికి చాలా బాధపడుతున్నాననీ, ఈ మేరకు నా తోటి నటీనటులందరికీ క్షమాపణలు తెలుపుతున్నాననీ, కొందరి మీద ఉండే అపారమైన ప్రేమే మనల్ని ఇంతటి పిచ్చి పనులను చేయిస్తుందని విల్ చెప్పుకొచ్చాడు.
 
ఇకపోతే... ఆస్కార్స్‌ 2022 ఈవెంట్‌ వేదికగా జరిగిన షాకింగ్‌ ఈవెంట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే అకాడమీ రూల్స్‌ ప్రకారం.. విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ''హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)'' అంటూ ట్వీట్‌ చేసింది అకాడమీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ త‌దుప‌రి చిత్రం మిషన్ లాంచ్