ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్ మృతి చెందారు. మరణించేనాటికి ఆయన వయస్సు 72 సంవత్సరాలు. 1991లోఅంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు.
1985లో వచ్చిన కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
అలాగే ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయిన విలియమ్ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన క్యాన్సర్ కారణంగానే చనిపోయారా లేక వృద్దాప్యపు సమస్యలతో మరణించారా అన్నదానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.