Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి రెండు అంబులెన్సులు అందచేసిన ఎంఈఐఎల్

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (18:34 IST)
మంగ‌ళ‌గిరిలోని ఎన్  ఆర్ ఐ  జనరల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రెండు అంబులెన్స్ లను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ ఎల్  ) సంస్థ బుధవారం అందచేసింది. ఎం ఈ ఐ ఎల్ సంస్థ డైరెక్టర్ పి. సుధారెడ్డి అంబులెన్సు ల తాళం చెవులను ఎన్  ఆర్ ఐ  సంస్థ అధ్యక్షులు నరసరాజు,  ప్రిన్సిపల్  లక్ష్మి కి బుధవారం ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమం లో  అందచేశారు.
 
 
ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావటంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. హైద‌రాబాద్ లోని నిమ్స్ లో కాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులు, గ్రామాలకు కూడా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ  అంబులెన్సులలో ఐ సి యూకు అవసరమైన    సౌకర్యం కల్పించినట్లు ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 
 
అంబులెన్సు ను వివిధ ఆసుపత్రుల నుంచి ప్రాణాపాయంలో ఉన్నరోగులు, రోడ్ లేదా ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలిస్తామని ఎన్  ఆర్ ఐ  జనరల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి  చైర్మన్, సి ఈ ఓ లు నరసరాజు, వెంకట ఫణిధర్ తెలిపారు.  అంబులెన్సులో పోర్టబుల్ వెంటిలేటర్,  మానిటర్, డెఫ్యూబ్ లెటర్, ఇన్ఫ్యూజన్, ఆక్సీజెన్, సెక్షన్ మొదలైనవి ఉంటాయి. అంబులెన్సు ను ఆసుపత్రికి అందచేసే కార్యక్రమంలో  ఎన్ ఆర్ ఐ అకాడమీ అఫ్ సైన్సెస్ కోశాధికారి టి సి చౌదరి  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments