చకచకా పోలవరం నిర్మాణ పనులు.. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (11:25 IST)
పోలవరం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఒక బృహత్తర ప్రాజెక్ట అయిన ఇది. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ సర్కారు నిర్మిస్తోంది.

ప్రాజెక్ట్‌లోని ప్రధానమైన స్పిల్ వే డ్యాం, కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందివ్వడంతో పాటు తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడంతో పాటు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం.
 
2005లో అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పని ప్రారంభమైంది. కానీ 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు మందకొడిగా సాగినా.. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం పనులు ముందుకు సాగాలంటే రివర్స్ టెండరింగ్ విధానంతో పాటు ద్వారా రాష్ట్ర ఖజనాకు ఆదాయాన్ని మిగుల్చుతు పోలవరం నిర్మాణ పనుల మహత్తర కార్యాన్ని మేఘా కంపెనీకి అప్పగించారు సీఎం జగన్.
 
అలాగ పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో 1.18 కిలోమీటర్ల పొడవైన నిర్మాణంగా రూపుదిద్దుకుంటోంది. 55 మీటర్ల ఎత్తుతో 51 బ్లాకులు, నదీ గర్భంలో మూడు, రాతి, మట్ట కట్ట నిర్మాణాలు, ఈ మూడింటి పొడవు 2.35 కిలోమీటర్లు. ఇవి అరుదైన, అతిపెద్ద నిర్మాణాలు. స్పిల్ వే వైపు అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ఎంత పెద్ద వంటే 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించేలా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments