Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి ఆలయానికి మేఘా 6 కేజీల బంగారం విరాళం

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (09:38 IST)
యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని ఇస్తున్నారు. విరాళాలు ప్రకటించడంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. 
 
కాళేశ్వరం సహా అనేక కీలక ప్రాజెక్టులు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థ 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకోవడం తమకు ఎంతో గౌరవప్రదమని సంస్థ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని తెలిపారు. 
 
అలాగే, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, రోడ్లు, హైవేల పనులు చేస్తున్న కేఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ కామిడి నర్సింహారెడ్డి 2 కేజీల బంగారం విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే ప్రణీత్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఎండీ నరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌ కామరాజు 2 కిలోల బంగారం ఇస్తామని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జలవిహార్‌‌‌‌‌‌‌‌ ఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌వీ రామరాజు కిలో బంగారం ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తీసుకొచ్చారు. దీన్ని బుధవారం టెంపుల్ ఈవో గీతారెడ్డి విడుదల చేశారు. ప్రజలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేందుకు వీలుగా అకౌంట్ నంబర్ తో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ ను రిలీజ్ చేశారు. యాదగిరిగుట్టలోని ఇండియన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIB000Y011ను అందుబాటులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments