Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్ అమలు :సీఎం జగన్

నేటి నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్ అమలు :సీఎం జగన్
, గురువారం, 21 అక్టోబరు 2021 (08:59 IST)
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్డేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్‌ ప్రసింగారు.
 
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు.

ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిగా వారికి వీక్లీఆఫ్‌ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను.

కోవిడ్‌ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్‌ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం.

దేశం మొత్తం నేడు అమరవీరుల దినం జరుపుకుంటున్నాం. కరంచంద్, ఆయన సహచరుల ధైర్యాన్ని  62యేళ్లుగా గుర్తు చేసుకుంటున్నాం. అమరులైన పోలీసు కుటుంబాలకు సమాజం అండగా ఉంటుంది. గత యేడాది కాలంలో మరణించిన పోలీసు సోదరులకు ప్రభుత్వం తరపున శ్రద్దాంజలి. 
 
వారి కుటుంబ సభ్యులు కు నా ప్రగాఢ సానుభూతి. సమాజం కోసం బాధ్యత లు నిర్వర్తిస్తున్న పోలీసు సేవలను గుర్తించాం. గతంలో ఎవరూ చేయని విధంగా దేశంలో తొలిసారిగా వీక్లీ ఆఫ్ లు అమలు చేశాం. కోవిడ్ వల్ల ఇది కొంతకాలంగా అమలు చేయలేక పోయాం. 
 
ఈరోజు నుంచి మళ్లీ వీక్లీ ఆఫ్ లను అమలు చేస్తాం. 2017నుండి బకాయిపెట్టిన 1500కోట్లను మేము విడుదల చేశాం. పోలీసు శాఖ లో ఖాళీలను భర్తీ చేసేలా నోటిఫికేషన్ ఇస్తాం. హోంగార్డుల గౌరవ వేతనం కూడా ఈ ప్రభుత్వమే పెంచింది
 
పోలీసు శాఖలో‌నూతనంగా 16వేల మందిని గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో నియమించాం. కరోనాతో మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులు కు ఐదు లక్షలు మంజూరు చేశాం. మ్యాచింగ్ గ్రాంట్ గా మరో ఐదు లక్షలు ఇస్తున్నాం. 
 
దేశంలొ ఎక్కడా లేని విధంగా ఎక్స్ గ్రేషియా, ఇతర సదుపాయాలు కల్పించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ అమల్లోకి తెచ్చాం. దిశ బిల్లు ను ఉభయ సభలు ఆమోదించి .. కేంద్రం ఆమోదం కోసం పంపాం
 
మహిళా హోం మంత్రి ఆధ్వర్యంలో అనేక రక్షణ చర్యలు చేపట్టాం. జాతీయ స్థాయిలో ఈ‌సేవలకు ఆదరణ లభిస్తుంది. పెరుగుతున్న టెక్నాలజీ తో పోలీసులు బాధ్యత లు మరింత విస్తరించాలి. వైట్ కాలర్ నేరాలను నియంత్రించేలా సాంకేతికత ను అందుబాటులో కి తెస్తాం. 
 
నేరం కొత్త కొత్త రూపాలలో దాడి చేస్తుంది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం లో కొత్త కోణం చూస్తున్నాం. కొత్త నేరగాళ్లు ఎలా చేస్తున్నారో మన కళ్ల ముందే కనిపిస్తుంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం, కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. 
 
సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు కోర్టు లలో కేసులు వేశారు. ఇళ్ల నిర్మాణం కుడా ఆపి వేయించారు... పేదలకు ఇంగ్లీషు మీడియం దక్కకుండా చేశారు. అబద్దాలనే డిబేట్లుగా ప్రచారం చేయడం పచ్చ చానళ్లు, పచ్చ పత్రిలను చూస్తాం. 
 
చివరకి సిఎం నే బోష్ డికే  (లం.. కొ)అనే స్థాయికి దిగజారారు. మన వాడు సిఎం కాదని.... నా తల్లిని కూడా తిడతారా. నేడు ఇలాంటి వారిని ఎదుర్కొని ప్రజల కోసం మంచి పాలన అందిస్తున్నా. 
 
స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉప ఎన్నికలలో అధికార పార్టీ కి అఖండ విజయం అందించారు. ఇక అధికారం రాదనే దుగ్ధతో ఎపి పై విషం చిమ్ముతున్నారు. 
 
రాష్ట్రం లో డ్రగ్స్, గంజాయి సరఫరా అంటూ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వీరు ఒక్క సిఎం మీదే కాదు.. ఎపి ప్రజల పై చేస్తున్న దాడి. ఇది అధర్మం, అనైతికం, పచ్చి అబద్దం. 
 
కేంద్రం దర్యాప్తు బృందాలు, విజయవాడ సిపి, డిజిపి ఇది అబద్ధం అని ఆదారాలతో చూపించారు. అయినా క్రిమినల్ మైండ్ తో రాష్ట్ర యువత పై కళంకిత ముద్ర వేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రధాన ప్రయారిటీ... తన, మన బేధం వద్దు. 
 
పౌరుల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు. బడుగు, బలహీన వర్గాల పై దాడి చేస్తే చట్టం ముందు నిలబెట్టాలి. సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు ఉక్కు పాదం మోపండి. మనందరి ప్రభుత్వానికి మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ నుంచి పోలవరం నిధుల కోసం పోరాట కార్యాచరణ: సీపీఐ