Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానంలో టీవీ నటితో అసభ్య ప్రవర్తన : వ్యాపారవేత్త అరెస్టు

Advertiesment
విమానంలో టీవీ నటితో అసభ్య ప్రవర్తన : వ్యాపారవేత్త అరెస్టు
, గురువారం, 21 అక్టోబరు 2021 (08:13 IST)
ఒక విమానంలో టీవీ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ వ్యాపారవేత్తను విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 3న టీవీ నటి విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లింది. ముంబైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఓవర్‌ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన లగేజీని తీసుకునేందుకు నటి లేచి నిల్చోగా పక్క సీట్లో ఉన్న వ్యాపారవేత్త ఆమె నడుమును పట్టుకుని ఒక్కసారిగా లాగి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు. 
 
ఈ హఠాత్ పరిణామానికి నటి ఖిన్నురాలైంది. ఆ తర్వాత వ్యాపారవేత్త వివరణ ఇస్తూ.. పురుషుడు అనుకుని అలా చేశానని చెబుతూ ఆమెకు క్షమాపణ చెప్పాడు. నటి ఇంటికి వెళ్లిన తర్వాత విమానంలో జరిగిన విషయాన్ని విమానయాన సంస్థకు మెయిల్ చేసి ఆ వ్యక్తి వివరాలు కావాలని కోరింది. 
 
అయితే, అతడి వివరాలను తాము ఇవ్వలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతో ఆమె ఆ తర్వాతి రోజున ముంబైలోని సహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన నిందితుడైన వ్యాపారవేత్తను ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, 24 గంటలపాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. 
 
ఇదిలావుంటే, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారవేత్త కుటుంబం నుంచి తనకు ఒత్తిళ్లు వస్తున్నట్టు నటి పేర్కొంది. వ్యాపారవేత్త భార్య, మరో వ్యక్తి తన ఇంటికి వచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అడిగారని, వారికి తన ఇంటి అడ్రస్ కూడా తెలిసిపోయిందని, మళ్లీ వస్తారేమోనని భయంగా ఉందని నటి వాపోయింది. ద

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాను ఎదుర్కొనేందుకు వాక్సినేషన్ ఒక్కటే మార్గం: విజయవాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్