Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ళకు - ఉత్పల్ పారికర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (17:25 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన వేగుళ్ళ జోగేశ్వర రావుకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఆయన హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగేశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలకు కరోనా సోకింది. 
 
ఇప్పటికే రాష్ట్రానికి చెందిన విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు. 
 
ఇదిలావుంటే, బీజేపీ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ కరోనా బారినపడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఉత్పల్‌ తెలిపారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. 
 
మైల్డ్‌ ఇన్ఫెక్షన్‌ కాబట్టి నేను హోం క్వారంటైన్‌లో ఉంటానని శనివారం సాయంత్రం చెప్పారు. 'వైద్యుల సలహా మేరకు, సరైన చికిత్స తీసుకోవడానికి నేను ఆస్పత్రిలో చేరాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఉత్పల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments