Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుచ్చిలో మేజర్ బాలిక మిస్సింగ్ : రంగంలోకి దిగిన జనసేన నేత.. కేసు నమోదు చేసిన పోలీసులు

వరుణ్
గురువారం, 11 జులై 2024 (12:24 IST)
నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన బుచ్చిలోని కొత్త బస్టాండ్ సమీపంలో వున్న శివాలయ ఎదురుగా చిన్నపాటి వ్యాపారం నడుపుకుంటున్న మహిళ నాగ నిర్మల అనే మహిళ కుమార్తెను మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధిత మహిళ స్థానిక జనసేన పార్టీ నేతలను ఆశ్రయించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గురువారం సందర్శించి పోలీస్ స్టేషనులో సిఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి త్వరితగతిన అదృశ్యమైన బాలికను గుర్తించాలని కోరారు. బాలిక తల్లిదండ్రులు విచారించగా ఫిర్యాదు మాత్రమే ఇచ్చారని కేసు నమోదు చేయమని చెప్పలేదని పోలీసులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా జనసేన జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ, మగదిక్కు లేని ఇద్దరు మహిళలు తమ బిడ్డను తెల్లవారుజామున ఇంటికి ఇంటి నుంచి అపహరించకపోయారని పోలీసులకు తెలిపే రెండు రోజులైనా ఆచూకీ లేదని జనసేన పార్టీని ఆశ్రయించారు. బాలిక మిస్సింగ్ కేసు ఆషామాషీగా చూడడం తప్పు... మేజర్ బాలికే కదా మరో రెండు రోజుల్లో తిరిగి వస్తుందని ఎవరో అధికారులు తెలపడం హేయమైన చర్య. సీఐ వెంటనే స్పందించి కేసు కట్టి విచారణ చేపడతానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డకి ఆపద అని తెలపిన తక్షణమే స్పందించి సిఐకి కేసును చేదించమని ఆదేశించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు అని తెలిపారు. వీలైనంత త్వరగా బాలికను తల్లిదండ్రులకు అప్పగించే వరకు కూడా జనసేన పార్టీ తరపున మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments