Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ : 'మహర్షి' కలెక్షన్ల వర్షం

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:08 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 25వ చిత్రం "మహర్షి". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో పాటు వేసవి సీజన్ కావడంతో బాగా కలిసివచ్చింది. ఫలితంగా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్ చేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. 
 
ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.24.6 కోట్ల మేరకు వసూలు చేయగా, రెండో రోజు మాత్రం కాస్త తగ్గింది. కానీ వీకెండ్‌లో మళ్లీ పుంజుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫలితంగా కేవలం 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. 
 
ఇకపోతే, విదేశాల్లో ఒక మిలియన్ మార్కును దాటేసింది. ఓవర్సీస్‌లో ఒక్క మిలియన్ సాధించిన మహేష్ సినిమాల్లో మహర్షి 9వ సినిమా కావడం విశేషం. ఇప్పటికి 1.5 మిలియన్స్ క్రాస్ చేసి, 2 మిలియన్ క్లబ్‌కి చేరువలో ఉంది. వ్యవసాయం చేసే రైతు గొప్పతనాన్ని, పంట పండించే వాడి అవసరాన్ని చక్కటి సందేశం ద్వారా చెప్పడంతో మహర్షికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. 
 
ఈ చిత్రం కథ ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు.. వేసవి సెలవులు దీనికితోడు ప్రతి ఒక్కరూ చూసేవిధంగా ఈ చిత్రం ఉండటంతో సినీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, వచ్చే శుక్రవారం వరకు మరో కొత్త చిత్రం విడుదల లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసివచ్చింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments