Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నంలో వైకాపా నేతల అరాచకం : జనసేన నేత కారుకు నిప్పు!!

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తమకు ఎదురు తిరిగే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వాహనాలకు నిప్పు అంటిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వీరిపై పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైకాపా నేతల అరాచకాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్‌ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. 
 
'ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత నా కారును వైకాపా గూండాలు తగులబెట్టారు. జనసేన తరపున ప్రచారం చేస్తే నాపై వారికెందుకు అంత పగ? జగన్‌ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? పవన్‌ కల్యాణ్‌ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు. గతంలోనూ అర్థరాత్రి మా ఇంటిపై దాడి చేశారు. మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని కేసు పెట్టాం. ఒక్క రోజులో వారంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారు.
 
కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. వైకాపా వాళ్లను తిట్టలేదు.. వాళ్లతో గొడవకి వెళ్లలేదు. పవన్‌ కల్యాణ్‌పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేస్తారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నాను' అని కర్రి మహేశ్‌ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments