Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలతో వైకాపా నేతల అర్థనగ్న నృత్యాలు.. ఎక్కడ?

Advertiesment
girls dance

ఠాగూర్

, ఆదివారం, 26 మే 2024 (11:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలామణి అవుతున్నారు. వీరికి పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారు. దీంతో వైకాపా నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అనేక మంది వైకాపా నేతలు తిరునాల ఉత్సవం పేరుతో అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారిపై భౌతికదాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 
 
తాజాగా మేకపాటి సోదరుల స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో వైకాపా నేతలు అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు చేయించడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు తూట్లుపొడిచి నృత్యాలు చేయించారు. వారు ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ చట్టపరంగా సరైన చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో అనేక గ్రామాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న పోలీసులు.. మేకపాటి వంటి బడా వైకాపా నేతల స్వగ్రామాల్లో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం... మిగిలిన వారందరికీ మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న హైదరాబాద్!!