Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. బెదిరింపులు.. రూ.5కోట్లు డిమాండ్.. నిందితుడి అరెస్ట్..

ప్రేమకు ఇదివరకు వుండిన విలువలు సన్నగిల్లుతున్నాయి. ప్రేమ అనేది ప్రస్తుతం బెదిరింపులకు దారితీస్తోంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసే, మోసపోయే నేరాలు అధికమవుతున్నాయి. ఇదే తరహాలో ప్రేమ పేరుతో ఓ యువతిని

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (17:30 IST)
ప్రేమకు ఇదివరకు వుండిన విలువలు సన్నగిల్లుతున్నాయి. ప్రేమ అనేది ప్రస్తుతం బెదిరింపులకు దారితీస్తోంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసే, మోసపోయే నేరాలు అధికమవుతున్నాయి. ఇదే తరహాలో ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి.. ఆ యువతితో సన్నిహితంగా వున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వాటిని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని ఓ దుర్మార్గపు ప్రియుడు బెదిరించాడు. 
 
అంతేకాకుండా ప్రియురాలి తండ్రిని రూ.5కోట్లు కావాలని బెదిరించాడు. అయితే నిందితుడు అతిని ఇద్దరి మిత్రులను పోలీసులు సినీ ఫక్కీలో వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుతో వినీష్ ప్రేమించానని నమ్మించాడు. ఆ యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండేలా చేసుకొన్నాడు. ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను భద్రపరుచుకున్నాడు. చివరికి ప్రేమ పేరుతో మోసం చేశాడు. 
 
యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్‌‌లో ఫోటోలు పెడతానని బెదిరించాడు. అంతేకాదు ప్రియురాలి తండ్రి పెద్ద వ్యాపారవేత్త.. అతడికి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే అతని కుమార్తె ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయమై నిందితుడు వీనీష్‌తో ప్రియురాలి తండ్రి రూ. కోటి ఒప్పందం కుదుర్చుకొన్నాడు. 
 
ప్రియుడితో ఆ యువతి సన్నిహితంగా ఐదు ఫోటోలు దిగింది. ఈ ఐదు ఫోటోలను చూపి వీనీష్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని ప్రియురాలి తండ్రి పోలీసులకు చెప్పాడు. ప్రియురాలి తండ్రి ఒప్పందంలో భాగంగా కోటి రూపాయాల్లో తొలుత రూ.25 లక్షలు చెల్లిస్తానని వీనీష్‌ను నమ్మించారు. ఈ రూ.25 లక్షలను తీసుకొనేందుకు వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వచ్చారు. 
 
అయితే వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వ్యాపారవేత్త నుండి రూ. 25 లక్షలు తీసుకొన్న తర్వాత సీసీఎస్ పోలీసులు వీనీష్‌ను అతని స్నేహితులను వెంటాడి మరీ పట్టుకున్నారు. నిందితుల నుండి రూ. 25 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments