Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28 ఏళ్ల పాటు కళ్లల్లోనే వుండిన కాంటక్ట్ లెన్స్.. ఎలాగంటే?

కంటి నొప్పితో బాధపడుతూ.. ఓ మహిళ డాక్టర్‌ను సంప్రదించింది. ఆ డాక్టర్ ఎమ్ఆర్ఐ స్కాన్ తీసి చూసి షాకయ్యాడు. కంటిలో వున్న లెన్సే మహిళ కంటి నొప్పికి కారణమని తేల్చాడు. ఈ లెన్స్ కంటిలో ఎలా వెళ్లిందని.. ఆ మహిళ

Advertiesment
Woman
, శుక్రవారం, 17 ఆగస్టు 2018 (17:21 IST)
కంటి నొప్పితో బాధపడుతూ.. ఓ మహిళ డాక్టర్‌ను సంప్రదించింది. ఆ డాక్టర్ ఎమ్ఆర్ఐ స్కాన్ తీసి చూసి షాకయ్యాడు. కంటిలో వున్న లెన్సే మహిళ కంటి నొప్పికి కారణమని తేల్చాడు. ఈ లెన్స్ కంటిలో ఎలా వెళ్లిందని.. ఆ మహిళను అడిగితే ఆమె షాకిచ్చే సమాధానం ఇచ్చింది. అదేంటంటే.. 28 ఏళ్ల క్రితం తన లెన్స్ కనిపించకుండా పోయిందని.. ఇప్పుడు అదే కంట్లో దొరికిందేమోనని చెప్పింది. అంటే వైద్యులు షాక్ తిన్నారు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ ఇటీవల కంటి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆమె దగ్గరలోని ఓ క్లినిక్‌ను సంప్రదించింది. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యులకు ఆమె ఎడమ కంటిలో ఒక లెన్స్‌ ఉన్నట్లు తెలిసింది. అందువల్లే ఆమెకు విపరీతంగా నొప్పి కలుగుతుందని గుర్తించారు. ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌ చేసి లెన్స్‌ను బయటకు తీశారు డాక్టర్లు.
 
అయితే ఆ లెన్స్ ను పరీక్షించగా అది 28 ఏళ్ల కిందటే ఆ మహిళ కంటిలోకి వెళ్లినట్టు తేల్చారు. అంతేగాకుండా ఆ మహిళ గతంలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది. తనకు 14 ఏళ్ల వయసులో ఒక రోజు బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా షటిల్‌కాక్‌ నా కళ్లకు తగిలింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే కాంటక్ట్‌ లెన్స్‌ లేదు. షటిల్‌కాక్‌ తగిలినప్పుడే అది ఎక్కడే పడిపోయిందనుకున్నాను. 
 
కానీ అది తన కంటి లోపలికి వెళ్లి పోయి ఇన్నాళ్ల పాటు అలానే ఉండిపోయిందని.. దానివల్లే నొప్పి తీవ్రత అధికమైందని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతున్నానని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‌ముగిసిన వాజ్‌పేయి అంత్యక్రియలు.. చితికి నిప్పంటించిన దత్త పుత్రిక