Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మెడలో మూడు ముళ్లు వేశా.. కానీ ప్రియురాలిని వదిలి ఉండలేకున్నా...

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (09:25 IST)
భార్య మెడలో మూడుముళ్లు వేశాడు. మూడు నెలల పాటు కాపురం కూడా చేశాడు. కానీ, పెళ్లికి ముందు తాను ప్రేమించిన యువతిని వీడి ఉండలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన విశాఖ జిల్లాల జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా ఊటగడ్డ ప్రాంతానికి చెందిన బొజ్జా సాయికుమార్ (28) అనే వ్యక్తి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ ఆస్పత్రిలోనే పని చేసే ఓ యువతిని ఇష్టపడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పైగా, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. 
 
కానీ, ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోగా, తమ తమ పెద్దలు చెప్పినట్టుగా వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలో సాయి కుమార్‌కు మూడు నెలల క్రితం శ్రావణి అనే యువతితో వివాహమైంది. మూడు నెలల పాటు సంసారం జీవితం సాఫీగానే సాగింది. 
 
కానీ, ప్రియురాలిని విడిచిపెట్టి ఉండలేకపోయాడు. ఈ క్రమంలో భార్య ఉన్నప్పటికీ ప్రియురాలితో ఫోనులో మాట్లాడటం, చాటింగ్ చేయసాగాడు. దీంతో శ్రావణి కోపగించుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరివాడయ్యాడు. దీన్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ చేసుకునే ముందు.. భార్య శ్రావణికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భార్య ఆందోళనకు గురై ఇంటికి వచ్చే చూసేసరికి భర్త విగతజీవుడై కనిపించాడు. ఇక చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments