Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు పనీపాటా లేదా : ప్రత్యేక హోదాపై కామెంట్స్ చేసే వారిపై జీవీఎల్ సెటైర్లు

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (09:12 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి పనీపాట లేదా.. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సరైన కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ నిర్ణయాన్ని కోట్లాది మంది భారతీయులు స్వాగతిస్తున్నారన్నారు. పైగా, కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది ఒక్క బీజేపీ మాత్రమేనన్న విషయం ఆర్టికల్ 370 రద్దుతో నిరూపితమైందన్నారు. 
 
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, ఏపీకి ప్రత్యేకహోదా, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశాలపైనా స్పందించారు. ప్రత్యేకహోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతుంటారని, కాలక్షేపం కోసం ప్రత్యేకహోదా అనడం అలవాటైపోయిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా సమయం ఉందని, దీనిపై నరేంద్ర మోడీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments