కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. మార్చి 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వరకు వెయ్యి కోట్ల వరకు వస్తుందని టీటీడీ అంచనా వేసింది.
అయితే ఈ అంచనాలు ప్రస్తుతం తలకిందులైనాయి. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు వంద కోట్ల ఆదాయం సమకూరింది. గత 8 నెలల్లో రూ. 1.164 కోట్ల ఆదాయం రాగా, నవంబరులో ఏకంగా రూ.127.39 కోట్ల ఆదాయం వచ్చింది.
ఫలితంగా టీటీడీ వార్షిక ఆదాయం అంచనాలను దాటుకుంది. వార్షిక ఏడాదిలో వెయ్యి కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనాలు తలకిందులు కావడంతో ఈ వార్షిక ఆదాయం 1600 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.