Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి.. ఆమె గురించి?

Tarigonda Vengamamba Vardhanti
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (21:44 IST)
Tarigonda Vengamamba Vardhanti
శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి కార్యక్రమాలు వచ్చే నెల 5, 6వ తేదీల్లో తిరుమల, తిరుపతితో పాటు తరిగొండలో నిర్వహించేందుకు టీటీడీ బోర్టు ఏర్పాట్లు చేసింది. 
 
తరిగొండ వెంగమాంబ గురించి...
తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730లో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. 
 
ఈమెకు పదేండ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. 
 
ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి. వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. 
 
ఈ సేవ నేటికీ జరుగుతూనే ఉంది. 1817 లో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-08-2022 శుక్రవారం దినఫలాలు - శ్రీవరలక్ష్మీని పూజించి, అర్చించిన శుభం