ఈ నెల 25వ తేదీ మంగళవారం అమవాస్యతో పాటు సూర్యగ్రహణం సంభవించనుంది. దీంతో శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తారు. ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. లడ్డూల విక్రయంతో పాటు అన్నప్రసాద వితరణ కూడా రద్దు చేస్తారు.
శ్రీవారి ఆలయం మూసివేస్తున్నందుకు దర్శనం కోసం ఇచ్చే అన్ని రకాల సిఫార్సు లేఖలు కూడా పనిచేయవు. సూర్య గ్రహణం ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనం కోసం అనుమతిస్తారు.
ఇదిలావుంటే, భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం 27 యేళ్ల తర్వాత ఏర్పడనుంది. వచ్చే 2025లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనున్నప్పటికీ అది భారత్‍లో కనిపించే అవకాశం లేదు. భారత్‌లో మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాలంటే వచ్చే 2032 వరకు వేచి వుండాల్సి వుంది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఈ సూర్యగ్రహణం సాయంత్రం 4.59 గంటలకు కనిపించనుంది.