Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప నడిబొడ్డున న్యాయవాది అనుమానాస్పద మృతి... హత్యేనా...?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (12:06 IST)
తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు వరుసగా హత్యకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వామనరావు అనే న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నడిబొడ్డున ఓ న్యాయవాది అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే రాజారెడ్డి వీధికి చెందిన‌ న్యాయవాది పి.సుబ్రమణ్యం గ‌త‌ రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గా ఆయ‌న సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉంద‌ని వారికి తెలిసింది.
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అ సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి ఆయ‌న కోసం వెతికారు. అక్కడే సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పులు ఉన్నాయి కానీ, మ‌నిషి లేక‌పోవ‌డంతో అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో గాలించారు.
 
అపార్ట్‌మెంట్‌ కింద సుబ్రమణ్యం మృత‌దేహం రక్తపు మడుగులో పడి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆయ‌న‌ను ఎవ‌రైనా హత్యా చేశారా? లేక ఆయ‌న‌ ఆత్మహత్యకు పాల్పడ్డా‌? అన్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments