Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన లక్ష్మీ పార్వతి

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (15:05 IST)
చంద్రబాబు పై వైసీపీ ప్రధానకార్యదర్శి శ్రీమతి లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. ప్రజలు ఓటుతో మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ...

"పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు.  రాగానే నాలుగులక్షల ఉద్యోగాలు భర్తీ,ఆర్టిసి విలీనం,ఆశావర్కర్స్‌ కు జీతాలు పెంచడం.వృధ్దులకు పెన్సన్‌ లను పెంచడం ఇలా ఎన్నింటినో నాలుగునెలల్లోనే అమలుచేసిచూపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే వైయస్‌ జగన్‌ పాలన సాగుతోంది.

ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే నక్కతోక ఎండబెట్టుకుందంట అలా ఉంది చంద్రబాబు వైఖరి.  అలనాడు బాపు చెప్పిన గ్రామస్వరాజ్యం నేడు వైయస్‌ జగన్‌ తీసుకువస్తూ గ్రామాల అభివృధ్దే రాష్ట్రం అభివృధ్ది అని చెబుతూ జగన్‌ గారు గ్రామసచివాలయాల వ్యవస్ద తీసుకువచ్చారు. గ్రామవాలంటీర్ల వ్యవస్దను ఏర్పాటుచేసి పధకాలను నేరుగా పేదల ఇళ్లకే తీసుకువెళ్లేలా చేశారు.

 
నిరుద్యోగం పోగొట్టేలా జగన్‌ గారు చేశారు.  ఎస్సీఎస్టీలకు 200యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నారు.  ఎన్ని స్కీములు తీసుకువచ్చారంటే మద్యం మహమ్మారిని పొగొట్టేలా మద్యం నియంత్రణకోసం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వం మాటలతో ప్రజలను మభ్యపెట్టింది. గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నోకుంభకోణాలకు పాల్పడ్డారు.కాగ్‌ తో సహా చాలా సంస్దలు నీ అవినీతిని,తప్పులను ఎత్తిచూపాయి.

చంద్రబాబూ...ప్రత్యేకహోదాపోయింది... నీవు చెప్పిన ప్రత్యేకప్యాకేజి ఎక్కడికి పోయిందో తెలియదు కాని నీ ప్యాకేజి మాత్రం బ్రహ్మాండంగా తీసుకున్నావు. రాజధాని,పిపిఏలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డావు. పోలవరంకు సంబంధించి నీవు,నీ కుమారుడు కమీషన్లకోసం అక్రమాలకు పాల్పడ్డావు.

పిపిఏల ద్వారా ప్రజలకు చాలా నష్టం జరిగింది.దానిని పునఃసమీక్ష చేస్తుంటే వాటిని సైతం విమర్శిస్తున్నారు.
 చంద్రబాబు ఆరులక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.అలాంటి చంద్రబాబుకు శ్రీ వైయస్‌ జగన్‌ ను విమర్శించే నైతిక హక్కు లేదు. రైతులకు రుణమాఫి చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. నీ కొడుకుకు మాట్లాడటం రాదు. ట్విట్టర్‌ బాబు అని పేరు తెచ్చుకున్నాడు.

ట్విట్టర్‌ లో మాత్రమే కొడుకును కన్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కేరళ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్‌ లో అక్షరాస్యత పెంచడానికే అమ్మఒడి పధకం ప్రవేశపెట్టారు. అద్బుతమైన పధకం. వైయస్‌ జగన్‌ ఆలోచనలవల్ల ఏపి ప్రగతి వైపు బాటలు వేస్తోంది. చంద్రబాబు డ్వాక్రామహిళలను సైతం మోసం చేశారు.నిరుద్యోగభృతి లేదు.అంగన్‌ వాడిలకు జీతాలు పెంచలేదు.ఐదేళ్లు మాత్రం దోపిడీ సాగించారు.

చంద్రబాబు తెచ్చిన 3.56 లక్షలకోట్ల అప్పులు ఏమయ్యాయో తెలియదు.  వైయస్‌ జగన్‌ శాస్త్రీయంగా మంచిపరిపాలన కోసం అందిస్తున్న పధకాలలో ఒక్కటన్నా మెచ్చుకున్నావా?  ఆంధ్రప్రదేశ్‌ విభజనకు చంద్రబాబే కారణం. కోడెల శివప్రసాద్‌ శవాన్ని భుజాన వేసుకుని ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడావు. వారి(కోడెల సంతానం) ద్వారా దారుణాలు,మోసాలు అన్నీ కూడా నీ పరిపాలనలో జరిగాయి.

 ప్రభుత్వ పాలనకు ప్రత్యామ్నాయ పాలన చేస్తూ వారు చిరువ్యాపారులను సైతం దోచుకుతిన్నారు. ఆ ప్రజలు కేసులు పెడుతుంటే వాటిని పెట్టకూడదంటారా?ఆ కేసులేమైనా ప్రభుత్వం పెట్టించిందా? నిన్నటిదాకా చంద్రబాబు పెంచిపోషించిన అక్రమకుటుంబాన్ని చివరకు అసెంబ్లీ ఆస్దులను కూడా కాజేసి స్పీకర్‌ పదవికే మచ్చతెచ్చిన వ్యక్తి కోడెల. స్పీకర్‌ పదవికే మచ్చతెచ్చిన వ్యక్తి నీ కారణంగా వారు సంతానం కారణంగా చనిపోతే శవరాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు.

శవరాజకీయం చేస్తూ హైద్రాబాద్‌ నుంచి పలుచోట్ల ఆపుకుంటూ వచ్చి నరసరావుపేట తీసుకువచ్చావు. గతంలో వారికి అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వలేదే. చంద్రబాబూ....నీచమైన కుట్రలు ఇంకా అపవా? ఎన్టీఆర్‌ దగ్గరనుంచి ఇప్పటివరకు నీవు సాగిస్తోంది నీ అరాచకరాజకీయం, నీకు వంతపాడుతున్న నీ మీడియా.

 
 వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియాకు చెప్పారు. ఎక్కడ మా లోపం ఉందో తెలియచేయండి.లోపాలను చెబితే సరిచేసుకుంటాం అని చెప్పారు. ఆ రెండే రెండు ఛానల్స్‌ నాగురించి ఎంత బ్యాడ్‌ గా ప్రచారం చేశారు. అలాంటి హక్కు మీడియాకు ఉందా? మహిళను,ముఖ్యమంత్రి భార్యపై స్టూడియోలో ఓ వ్యక్తిని తీసుకువచ్చి నా ఆత్మగౌరవం దెబ్బతినేలా చేశారే?

అదే నేను ఆత్మహత్య చేసుకుని ఉంటే ఏం చేసేవారు.ఇన్ని దారుణాలు మీరు చేయవచ్చా?  నా గురించి బ్యాడ్‌ న్యూస్‌ ప్రచారం చేయించిన దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు చేసిందంతా నిజమేనా? వాస్తవాలేనా,కోడెల శివప్రసాద్‌ ఏ తప్పు చేయలేదా?కోడెల కుమారుడు,కుమార్తెల వల్ల కోడెల నష్టపోయారు. చివరకు చంద్రబాబు చేసిన అసమర్దత వల్ల కోడెల ఆత్మహత్య చేసుకుంటే,కోడెల, రౌడీ కొడుకును పనికిమాలిన కూతురును కన్నారు దానివల్ల ఇలా జరిగింది.

పుత్రప్రేమవల్ల ఎలా నష్టం జరుగుతుందో భారతంలో ధృతరాష్ట్రుడు ఉదాహరణగా ఉంటే ఈ మధ్య కోడెల శివప్రసాద్‌ మిగిలారు. వ్యక్తిగతంగా మంచివ్యక్తే కావచ్చు.కాని సంతానం వల్ల చేస్తున్న దురాగతాలవల్ల ఈ పరిస్దితి వచ్చింది.వీటి గురించి తెలిసి దురాగతాలకు పాల్పడవద్దని మొదట్లోనే మందలించిఉంటే ఇలాంటి పరిస్దితి వచ్చిఉండేదా?

 
పేదలకు తక్కువధరకు విద్యుత్‌ అందించాలనే తపనతో వైయస్‌ జగన్‌ పిపిఏలను సమీక్షిస్తుంటే దానిని కూడా తప్పుపడుతున్నారు. అవినీతికి,ఆ సంస్ధలకు చంద్రబాబు అండగా ఉంటున్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 850కోట్ల ఆదా జరిగితే ఆఖరికి బిజేపివారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి విధానాల గురించి మాట్లాడకుండా ఇక్కడ తప్పుజరిగింది అని వాటిని సరిదిద్దుతుంటే వాటి గురించి చంద్రబాబు మాట్లాడడు.

ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశావు.కౌంటింగ్‌ ముందురోజు కూడా రెండువేలకోట్ల అప్పులు తెచ్చావు.
ఇలాంటి నీచమైన పరిపాలన చంద్రబాబు తప్ప మరొకరు చేయలేరు. కరకట్టపై ఉన్న ఇల్లు పడగొడుతున్నారంటూ మాట్లాడుతున్నారు.

అదేమైనా నీకు వారసత్వంగా వచ్చిందా?వరదలు వచ్చి అదికారులు, మంత్రులు ముంపు ప్రాంతాలలో ఇళ్లను కాపాడేందుకు పనిచేస్తుంటే నీవు మాత్రం విమర్శలు చేస్తావా? ఇక్కడ వరదలు వస్తుంటే నీవు హైద్రాబాద్‌ వెళ్లి నీ అక్రమకట్టడం మునిగిపోతుందని పదివేల ఇసుకబస్తాలు తెప్పించి వరదకు అడ్డుకట్టవేసే ప్రయత్నం చేశావు.
 చంద్రబాబు,లింగమనేని రమేష్‌ రహస్యాలన్నీ కూడా తేటతెల్లమైపోయాయి.

చంద్రబాబు ద్వారా లింగమనేని ఎంత అభివృధ్దిలోకి వచ్చాడో తెలిసిపోయింది.రమేష్‌ భూములు సిఆర్‌ డిఏ పరిధిలోకి రాకుండా చంద్రబాబు సహాయం చేశారు. ఈ అక్రమ సంబంధాల కోసమా మీ ఇద్దరు అంత బాధపడిపోతున్నారు.వేల కోట్ల అక్రమ సంపాదన గాని,బినామీల వ్యవహారాల డాక్యుమెంట్లు అక్కడ దాచిపెట్టావా? లింగమనేని కూడా ఓ రకంగా చంద్రబాబు బినామినే.

 
చంద్రబాబు ఎంతైనా నాకు అల్లుడు కదా ఆయనకు సెంట్‌ భూమి కూడా లేకపోతే మేమే చందాలు వేసుకుని 200 గజాల భూమి కొని అంతవరకు ఇల్లు కట్టించి ఇస్తాం. ఇందుకు అత్తగా నేను సిధ్దంగా ఉన్నాను. చంద్రబాబూ...ఇంకా ఛీ ఛా అని ప్రజలు అంటున్నా కూడా ఆ అక్రమ కట్టడం లో ఎందుకు ఉండటం.అది కూలగొడితే సానుభూతి వస్తుందని అనుకుంటున్నట్లు ఉంది. 

ప్రజావేదిక కూలగొడితే దేశమంతా అల్లకల్లోలం అయిపోనట్లు యాగీ చేశారు.ఇప్పుడు ఆయన అక్రమ కట్టడం కూలగొడితే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుందని అనుకుంటున్నాడు. ప్రజాసంక్షేమం అనేది మాత్రమే జగన్‌ కు కనబడుతోంది. చేతల ప్రభుత్వం కనుకనే అన్నీ చేసి చూపుతున్నారు.చంద్రబాబు మాత్రం ఇంకా ఛీప్‌ పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నారు.సినిమాలలో అయితే నటన బాగుంటుంది ఇక్కడ కాదు.చంద్రబాబు నటనకు ఆస్కార్‌ అవార్డ్‌ ఇవ్వచ్చని ఎన్టీఆర్‌ గతంలో చెప్పారు.
 
ఈ రోజున జగన్‌ పాలనలో అందరికి మేలు జరుగుతోంది.ఐదేళ్లలో రాజన్న రాజ్యం సాకారం కాబోతోంది.అప్పుల భారం తగ్గించేలా చేయడంతోపాటు కేంద్రంనుంచి నిధులు తేవడం అన్నీ జగన్‌ ప్రభుత్వం సాకారం చేస్తోంది.గత ప్రభుత్వం విచ్చలవిడిగా నిధులను దుర్వినియోగం చేసింది.ప్రత్యేక విమానాల ద్వారా పెద్దఎత్తున నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారు.

 
రాజధానిలో నమ్మి 33 వేల ఎకరాలు ఇస్తే గతంలో కళకళలాడిన భూమి నేడు స్మశానాన్ని తలపిస్తోంది.
ఇప్పటికైనా సరే చంద్రబాబు నిజమైన ప్రతిపక్షనేతలా వ్యవహరించాలని కోరుతున్నాను.లేకపోతే ప్రజలు ఇక్కడనుంచి వెళ్లగొట్టేపరిస్దితి వస్తుంది" అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments