Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాయిల్ తాగిన రెడ్‌శాండిల్ క్వీన్, మోడల్ సంగీతా చటర్జీ (Video)

రెడ్‌శాండిల్ క్వీన్‌గా పేరుగాంచిన మహిళా స్మగ్లర్, మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్తూరు సబ్ జైలులో ఉంటున్న ఆమె ఫినాయిల్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా ప్రభుత్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (15:15 IST)
రెడ్‌శాండిల్ క్వీన్‌గా పేరుగాంచిన మహిళా స్మగ్లర్, మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్తూరు సబ్ జైలులో ఉంటున్న ఆమె ఫినాయిల్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెపుతున్నారు. 
 
కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తిన మహిళా స్మగ్లర్‌ సంగీతా చటర్జీని చిత్తూరు పోలీసులు గత యేడాది అరెస్టు చేసిన విషయం తెల్సిందే. కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. ఓ విమాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తూ, ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌కు దగ్గరైన సంగీత.. అక్రమ రవాణాలో అడుగుపెట్టింది.. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు హవాలా ద్వారా సంగీత భారీగా నగదు మార్చింది. 
 
దీనిపై లోతుగా అన్వేషించిన చిత్తూరు పోలీసులు గత ఏడాది కోల్‌కతాలోని ఆమె నివాసంలో దాడులు చేశారు.. విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తెరిపించి, నకిలీ తుపాకీ లైసెన్సులనూ స్వాధీనం చేసుకున్నారు. పలుసార్లు ఆమెను అరెస్టుచేయాలని పోలీసులు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అడ్డంకులు ఎదురయ్యాయి. 15 రోజులపాటు కోల్‌కతాలో రెక్కీ నిర్వహించిన పోలీసులు చివరకు సంగీతను అరెస్టు చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments