Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాపింగ్ మాల్‌లో ఎంజాయ్... మహిళా రెడ్ శాండల్ డాన్ అరెస్టు.. చిత్తూరుకు...

ఆంధ్ర, తమిళనాడు, కోల్‌కత్తా పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన మాజీ ఎయిర్ హోస్టెస్, మహిళా ఎర్రచందనం డాన్ సంగీతా ఛటర్జీని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తాలోని ఒక షాపింగ్ మాల్‌లో ఆమె ఆనందంలో మునిగిపోయి వుంది. ఆమె అక

Advertiesment
Air Hostess Sangeeta Chatterjee
, బుధవారం, 29 మార్చి 2017 (15:00 IST)
ఆంధ్ర, తమిళనాడు, కోల్‌కత్తా పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన మాజీ ఎయిర్ హోస్టెస్, మహిళా ఎర్రచందనం డాన్ సంగీతా ఛటర్జీని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తాలోని ఒక షాపింగ్ మాల్‌లో ఆమె ఆనందంలో మునిగిపోయి వుంది. ఆమె అక్కడే వున్నదని తెలుసుకుని పక్కాగా వల పన్ని సంగీతను చుట్టుముట్టారు చిత్తూరు పోలీసులు. ఆమెను అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకువచ్చారు. చిత్తూరు మహిళా పోలీస్టేషన్‌లో సంగీతను అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉంచిన పోలీసులు ఆ తరువాత పాకాలకు తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరిచారు. 
 
ఉగాది పర్వదినం కావడంతో పాకాల కోర్టుకు సెలవు ఉండటంతో పోలీసులు నేరుగా జడ్జి దేవేందర్ రెడ్డి ఇంటికి తీసుకువచ్చి హాజరుపరిచారు. దేవేందర్ రెడ్డి సంగీతా ఛటర్జీని విచారించి 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో చిత్తూరు పోలీసులు ఆమెను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. శేషాచలం అడవుల నుంచి కోట్ల రూపాయల ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు సంగీతాతో పాటు ఆమె ప్రియసఖుడు లక్ష్మణన్ పైన ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే లక్ష్మణన్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు సంగీతాను కూడా అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకువచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో దారుణం.. శునకంతో అసహజ శృంగారం.. భార్యపై భర్త వేధింపులు