Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో క్లాష్... టీడీపీ నేత కారుపై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ గురువారం నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడ

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (14:56 IST)
నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ గురువారం నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఓ మైనార్టీ నేత అంత్యక్రియల సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. 
 
నంద్యాల వైసీపీ కౌన్సిలర్ చింపింగ్ బాషా చనిపోవడంతో, గురువారం అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పా చక్రపాణిరెడ్డి హాజరై తిరిగి వస్తుండగా, టీడీపీ నేత అభిరుచి మధుకు సంబంధించిన వాహనం వారికి అడ్డు వచ్చింది. వాహనాన్ని పక్కకు తీయాలని శిల్పా వర్గానికి చెందినవారు కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో... ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. 
 
ఈ క్రమంలో టీడీపీ నేత అభిరుచి మధుకు చెందిన వాహనంపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. దీంతో, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్నవారిని చెదరగొట్టేందుకు అభిరుచి మధు ప్రైవేట్ గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఉద్రిక్త పరిస్థితి గురించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. అలాగే, శిల్పా చక్రపాణిరెడ్డిని, అభిరుచి మధును వేర్వేరు మార్గాల్లో అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. గాల్లోకి కాల్పులు జరిపిన మధు గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments