నంద్యాలలో టీడీపీకి ఓటమి ఖాయమా? భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోనుందా..? అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారికి భన్వర్‌లాల్ వైకాపా పక్షపాతి అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముందుగానే ఫిర్యాదు చేసిందా? అనే ప్రశ్నలక
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోనుందా..? అందుకే రాష్ట్ర ఎన్నికల అధికారికి భన్వర్‌లాల్ వైకాపా పక్షపాతి అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముందుగానే ఫిర్యాదు చేసిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరాం మాల్యాద్రి సోమవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతి, కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ కలిసి ఫిర్యాదు చేశారు.
ఆయన పూర్తిగా వైసీపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీపై వైసీపీ చేస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్న భన్వర్‌లాల్ టీడీపీ ఫిర్యాదులపై మాత్రం అస్సలు స్పందించడం లేదని ఆరోపించారు.
నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే భన్వర్‌లాల్ ఆయనను బదిలీ చేశారని పేర్కొంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఏ విషయంలో ఫిర్యాదు చేసినా వెంటనే ఆయన స్పందిస్తున్నారని ఆరోపించింది.