ఆకాశంలో అద్భుతం.. హడలిపోయిన బ్రెజిల్ వాసులు (Video)
సాధారణంగా ఆకాశంలో మేఘాలు తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ నిర్మలంగా ఉన్న ఆకాశంలో ఒక్కసారి అకస్మాత్తుగా ఏర్పడిన నారింజ రంగు మేఘాన్ని చూసి బ్రెజిల్ వాసువు వణికిపోయారు.
సాధారణంగా ఆకాశంలో మేఘాలు తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ నిర్మలంగా ఉన్న ఆకాశంలో ఒక్కసారి అకస్మాత్తుగా ఏర్పడిన నారింజ రంగు మేఘాన్ని చూసి బ్రెజిల్ వాసువు వణికిపోయారు.
'ఏదైనా ఉపద్రవానికి ఇది సంకేతమా? ఉల్కాపాతం జరగబోతోందా?' అంటూ ఊహాగానాలు మొదలు పెట్టారు. బాణం ఆకృతిలో ఆకాశంలో ఐదు నిమిషాల పాటు కనిపించిన ఈ మేఘం బ్రెజిల్‌లోని టెక్సారియా దె ఫ్రెతాస్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్‌లో పెట్టారు. అయితే ఇది కేవలం దుమ్ము కణాల వల్ల ఏర్పడిన మేఘమే అని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.