నేడు సంపూర్ణ సూర్యగ్రహణం... భారత్‌పై ప్రభావం ఉంటుందా?
అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. 1979 తర్వాత తొలిసారి ఏర్పడుతున్న ఈ అతిపెద్ద సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారానికి అమెరికా పరిశోధనా సంస్థ "నాసా" ఏర్పాట్లు చేసింది. ఈ సూర్యగ్రహణం అమెరికా
అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. 1979 తర్వాత తొలిసారి ఏర్పడుతున్న ఈ అతిపెద్ద సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారానికి అమెరికా పరిశోధనా సంస్థ "నాసా" ఏర్పాట్లు చేసింది. ఈ సూర్యగ్రహణం అమెరికా అంతటా కనిపించనుంది.
ఒరెగాన్ నుంచి దక్షిణ కరోలినా వరకు 14 రాష్ట్రాల మీదుగా మొత్తం 90 నిమిషాల్లో సూర్యగ్రహణ ఛాయ మాయం కానుంది. ది గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్‌గా పిలుస్తున్న ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం 50 భారీ బెలూన్లను ఆకాశంలోకి పంపనుంది.
సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో అత్యంత నాణ్యతతో కూడిన వీడియోలను, చిత్రాలను అందించే కెమెరాలను అమర్చిన బెలూన్లను దాదాపు 80వేల అడుగుల ఎత్తు వరకు పంపిస్తారు. ఈ కెమెరాల ద్వారా గ్రహణ దృశ్యాలను చిత్రీకరించి లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు ఆరుగంటలపాటు సాగే గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోమాత్రమే కనిపించనుంది. అయితే, అది భారత్‌లో రాత్రి సమయం. అందువల్ల ఇండియాలో కనిపించే అవకాశం లేదు. ఫలితంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై ఏమాత్రం ఉండదు.
కాగా, సూర్యగ్రహణం సమయంలో భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాను టోర్నడోలు ఓ కుదుపుకుదుపుతున్నాయి.