Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలింత.. శరీరం రెండు ముక్కలైంది.. లేబర్ వార్డు నుంచి తీసుకొస్తూ..?

అప్పుడే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఆ పాపాయి పుట్టిన సంతోషం ఆ తల్లికి ఎక్కువ సేపు మిగల్లేదు. లేబర్ వార్డు నుంచి పై అంతస్తుకు తీసుకెళ్తుండగానే ఆ సంతోషానికి బ్రేక్ పడిపోయింది. ఏం జరిగిందంటే.. పండంటి

Advertiesment
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలింత.. శరీరం రెండు ముక్కలైంది.. లేబర్ వార్డు నుంచి తీసుకొస్తూ..?
, సోమవారం, 21 ఆగస్టు 2017 (14:04 IST)
అప్పుడే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఆ పాపాయి పుట్టిన సంతోషం ఆ తల్లికి ఎక్కువ సేపు మిగల్లేదు. లేబర్ వార్డు నుంచి పై అంతస్తుకు తీసుకెళ్తుండగానే ఆ సంతోషానికి బ్రేక్ పడిపోయింది. ఏం జరిగిందంటే.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన మహిళ లిఫ్ట్‌ డోర్‌లో చిక్కుకుపోయింది. ఆమె శరీరం రెండు ముక్కలైపోయింది. ఈ ఘోర ఘటన దక్షిణ స్పెయిన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సీవిల్లే ప్రాంతానికి చెందిన రోషియోనునేజ్‌ అనే మహిళ స్థానిక వాల్మే హాస్పిటల్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం లేబర్ వార్డు నుంచి లిఫ్టులో స్ట్రెచర్‌పై అంతస్తుకు తీసుకెళ్తుండగా.. లిఫ్ట్‌ మధ్యలో ఆగిపోయింది. దాంతో ఆమె పక్కనే ఉన్న నర్సులు బయటికి వచ్చేశారు. వారు బయటికొచ్చే క్రమంలో లిఫ్టు తలుపులు మూసుకుపోవడంతో రోషియోనునేజ్‌ లిఫ్టు తలుపులకు మధ్యలో ఇరుక్కుపోయింది. 
 
అంతే ఆమె శరీరం లిఫ్టు తలుపులకు మధ్య నలిగిపోయింది. శరీరం రెండు ముక్కలైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపై బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రోషియోనునేజ్ పాపను వేరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఆరోగ్య శాఖా మంత్రి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు భాషకు గ్రామర్ కాదు.. గ్లామర్ కూడా ఉంది: ఉప రాష్ట్రపతి వెంకయ్య