Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ప్రకృతి ఎక్కడ? కేంద్రమంత్రి కిషన్ ప్రశ్న

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (14:35 IST)
హైదరాబాద్ నగరంలో ప్రకృతి ఎక్కడ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. హైదరాబాద్, నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సేవ్ అవర్ జియో హెరిటేజ్ వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి పరంగా హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఈరోజున మానవ సమాజం అత్యాశకు పోయి ప్రకృతిని ధ్వంసం చేస్తోందని అన్నారు. ప్రకృతి గురించి, భావి మానవ సమాజం గురించి ఆలోచన చేయని దౌర్భాగ్యపు స్థితి ప్రపంచంలో ఉందని అన్నారు. 
 
హైదరాబాద్ నగరం విషయానికొస్తే గతంలో బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు గుట్టలు, ప్రకృతి అందాలతో ఉండేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చూస్తే, బంజారాహిల్స్‌లో బంజారా లేదు హిల్సూ‌లేవని, జూబ్లీ హిల్స్‌లో జూబ్లీ ఉంది గానీ, హిల్స్ లేవని, ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పాటుపడాలని, ప్రజలు చైతన్య వంతులు కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments