Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి స్టేషన్‍‌లో విషాదం.. రైలు ఎక్కే క్రమంలో కాళ్లు పోగొట్టుకున్నయువకుడు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (09:27 IST)
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. రైలు ఎక్కే క్రమంలో ఒక యువకుడు తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. బాధితుడిని ఖమ్మ జిల్లా వాసిగా గుర్తించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
ఖమ్మ జిల్లాకు చెందిన డి.నరేశ్ (26) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఎంబీఏ చేయాలనే ఉద్దేశ్యంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో ఆయనకు విశాఖపట్టణంలోని ఓ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కాలేజీలో చేరేందుకు విశాఖకు బయలుదేరారు. 
 
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. రిజర్వేషన్ లభించకపోవడంతో జనరల్ బోగీలోనే రాజమండ్రి వరకు వచ్చాడు. అక్కడ ఏసీ టిక్కెట్ తీసుకనేందుకు కిందకు దగినా ఆ అవకాశం లేదని తెలియడంతో మళ్లీ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికే రైలు బయలుదేరింది. 
 
దీంతో యువకుడు తన లగేజీతో సహా కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో బోగీలు, పట్టాలు మధ్య పడిపోవడంతో కాళ్లు ఇరుక్కుని పోయాయి. ఈలోపు రైలు వేగం పుంజుకోవడంతో ఫ్లాట్‌ఫాం విడిచి వెళ్లింది. రైలు వెళ్లిపోయే సమయానికి నరేశ్ రెండు కాళ్లు తెగిపోయాయి. పట్టాలపై పడివున్న ఆ యువకుడిని రైల్వే సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments