Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు

Advertiesment
Strange Child
, మంగళవారం, 7 మార్చి 2023 (13:10 IST)
Strange Child
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ వింత శిశువు జన్మించింది. అయితే ఈ నవజాత శిశువు పుట్టిన 20 నిమిషాలకే మరణించింది.   అయితే బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లోని గంగారాం ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... రతన్‌గఢ్‌లో రాజల్‌దేసర్‌లోని 3వ వార్డులో నివాసం ఉంటున్న 19 ఏళ్ల గర్భిణి హజారీ సింగ్‌ కు పురిటినొప్పులు రావడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించిన వైద్యులు అందులో వింత శిశువు కనిపించినట్లు డాక్టర్ కైలాష్ సొంగరా చెప్పారు. 
 
ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్‌కు నార్మల్ డెలివరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ  రకమైన డెలివరీని కంజుక్టివల్ అనోమలీ అంటారు. అయితే 20 నిమిషాలకే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ బిడ్డ ఇలా పుట్టడానికి క్రోమోజోమ్‌ల లోపం కావచ్చునని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే, నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’