Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకలు - గొర్రెలకు కరోనా పరీక్షలు... ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు!!

Karnataka
Webdunia
బుధవారం, 1 జులై 2020 (08:03 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. తాజాగా మేకలు, గొర్రెలు కూడా ఈ వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. మూగ జీవులను కూడా ఈ వైరస్ వదిలిపెట్టడం లేదు. ఫలితంగా గొర్రెలు, మేకలకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతంలో ఉన్న చిక్కనాయకహల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిక్కనాయకహల్లి ప్రాంతంలో అనేక గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు మేకలు, గొర్రెలతోపాటు వాటి యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించామని, 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. జీవాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంపై జిల్లా కమిషనర్ కె.రాకేశ్ కుమార్ విచారణ చేపట్టారు.
 
కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పలేమని పశువైద్యులు అంటున్నారు. మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని చెబుతున్నారు. 
 
జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్టు తెలిపారు. కాగా, గొర్రెల కాపరికి మాత్రం కరోనా పాజిటివ్ అని వచ్చినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments