Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ్యాట్రిమోనియల్ మోసం.. టెక్కీ అలా మోసపోయాడు..

మ్యాట్రిమోనియల్ మోసం.. టెక్కీ అలా మోసపోయాడు..
, బుధవారం, 24 జూన్ 2020 (11:39 IST)
ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఫోటో, వివరాలను వుంచి టెక్కీ మోసపోయాడు. అందమైన అమ్మాయితో అతనికి ఏర్పడిన పరిచయం కాస్త మోసపోయేందుకు కారణమైంది. ఇదంతా బెంగళూరులో చోటుచేసుకుంది. ఎవరికీ దక్కని అమ్మాయిని తానే చేసుకుంటున్నానని లోలోపల ఖుషీ అయిపోయాడు. ఫోటోలు పంపడంతో ఆకాశంలో తేలిపోయాడు. 
 
ఆ తర్వాత ఇద్దరూ వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాలింగ్స్ చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. గురుడు ఓకే అంటూ కమిట్ అయ్యాడు. ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెట్టింది. ఉన్నట్టుండి.. ఎవరికో యాక్సిడెంట్ అని ఫోన్ చేసింది. రూ.లక్ష లాగేసింది. పెళ్లి కోసం కొన్నేళ్లుగా మనీ దాస్తున్న అతను... ఆమె అడగ్గానే పూర్తి నమ్మకంతో అప్పటికప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు.
 
ఆ తర్వాత మరికొన్ని రోజులకు మరో డ్రామా. ఇలా చాలా డ్రామాలు ఆడింది. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కహానీ చెప్పి... లక్షలు లాగేసింది. మొత్తం రూ.16 లక్షల 82 వేలు స్వాహా చేసింది. ఆ తర్వాత నుంచి... అతనితో మాట్లాడటం మానేసింది. అతను కాల్ చేస్తే... కట్ చేస్తోంది దీంతో తాను మోసపోయానని పోలీసులు ఆశ్రయించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాయా'లేడి' : పెళ్లి పేరుతో టెక్కీ వద్ద రూ.16 లక్షలు దోచుకుంది.. ఎక్కడ?