కెకె రాజు ఇంటికి వెళ్ళి అభినందించిన డిప్యూటీ సీఎం ధ‌ర్మాన

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (12:23 IST)
విశాఖ వైసీపీ నేత కె కె రాజు ఇంటికి వెళ్ళి మ‌రీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాస్ త‌న అభినంద‌న‌లు తెలిపారు. నెడ్ క్యాప్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజుకు భారీగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

నెడ్ క్యాప్ ఛైర్మ‌న్ గా ఎంపిక అయిన కెకె.రాజు హైద‌రాబాదు నుంచి విశాఖ‌కు భారీ ర్యాలీతో రాగా, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆయ‌న‌ నివాసానికి స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప‌లువురు విశాఖ కార్పొరేట‌ర్లు, మాజీలు, సీనియ‌ర్ నాయ‌కులు కెకె రాజుకు విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వైసీపీ క్యాడ‌ర్ సీత‌మ్మ ధార నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. కెకె రాజు జిందాబాద్ అంటూ నినాదాల‌తో విశాఖ‌ను మ‌రు మ్రోగించారు.

త‌న‌కు నెడ్ క్యాప్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినందుకు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కె కె రాజు కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి, నామినేటెడ్ ప‌ద‌వి క‌ల్పించినందుకు ఆయ‌న‌కు కూడా కృత‌జ్న‌త‌లు తెలిపారు. నెడ్ క్యాప్ కు రాష్ట్రం అంతా 12 జిల్లాల‌లో కార్యాల‌యాలు ఉన్నాయ‌ని, ఇక విశాఖ‌లో రాష్ట్ర కార్యాల‌యాన్ని త్వ‌ర‌లో ఏర్పాటు చేస్తామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments