Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 రోజుల పాటు ఆడ‌వారికి ఆర్టీసీ బ‌స్సు ఫ్రీ... ఎక్క‌డ‌?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (12:03 IST)
విజయనగరం పోలీసులు ఓ వినూత్న ఆఫ‌ర్ ఇచ్చారు. దిశ యాప్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఆర్టీసీ సిటీ బ‌స్ లో 5 రోజుల పాటు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించారు. దిశా యాప్‌తో మహిళలకు భద్రత ల‌భిస్తుంద‌ని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ భ‌రోసా ఇచ్చారు.

దిశ యాప్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5 రోజుల పాటు ఆడవాళ్లు ఉచితంగా ప్ర‌యాణించేందుకు బస్సు సదుపాయం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల మిమ్స్‌ నుంచి విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్సు వరకు ఎస్‌పి బస్సులో ప్రయాణించి కళాశాల విద్యార్థినులు, మహిళలకు దిశా యాప్‌ పట్ల అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ, దిశా యాప్‌ మనతో ఉంటే రక్షణ మన వెంటే అని అన్నారు. ప్రతి మహిళ తమ స్మార్ట్‌ ఫోనులో దిశా యాప్ ఇన్ స్టాల్ చేసుకొని, ఆపద సమయాల్లో యాప్‌లోని ఎస్‌ ఓస్‌ బటన్‌ను నొక్కినట్లయితే, క్షణాల్లో మీరున్న ప్రదేశానికి పోలీసులు చేరుకొని, రక్షణ కల్పిస్తారన్నారు. ఈ యాప్‌ పట్ల అవగాహన కల్పించేందుకు వినూత్నంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 14న పోలీసుశాఖ ఆధ్వర్యంలో రెండు పోలీసు బస్సులను ఏర్పాటు చేసి, దిశా యాప్‌ చూపిన వారికి నగరంలో ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేశామన్నారు. అనంతరం దిశా యాప్‌ ముద్రింన మాస్క్‌లను విద్యార్థినులకు జిల్లా ఎస్‌.పి పంపిణీ చేశారు. పోలీసుల ప్రచారానికి విశేష స్పందన వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments