Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబూల్‌లో తాలిబన్లు శాంతిమంత్రం.. విదేశీయులు వుండవచ్చు.. కానీ రిజిస్ట్రేషన్..?

కాబూల్‌లో తాలిబన్లు శాంతిమంత్రం.. విదేశీయులు వుండవచ్చు.. కానీ రిజిస్ట్రేషన్..?
, సోమవారం, 16 ఆగస్టు 2021 (11:25 IST)
Taliban
అంతా అనుకున్నట్లే జరిగింది. అఫ్ఘానిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది. తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఊహించినదానికంటే వేగంగా కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. తాలిబన్ జెండాను ఎగురవేశారు. ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్రమించుకుంటూ తాలిబన్లు ముందుకు దూసుకొచ్చారు. చేసేది ఏమి లేక అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధ్యక్ష పదవికి ఘనీ రాజీనామా చేశారు. మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు తాలిబన్లు.  
 
కాబూల్‌లో తాలిబన్లు శాంతిమంత్రం పఠించారు. ప్రభుత్వమే అధికారాన్ని తమకు అప్పగించాలని తాలిబన్లు షరతు విధించారు. ఘనీ రాజీనామాతో సాధారణ ప్రజలకు హాని తలపెట్టబోమని ప్రకటించారు. శాంతియుత చర్చల ద్వారానే కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేశారు. విదేశీయులు అఫ్ఘాన్‌లో ఉండాలనుకుంటే ఉండొచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సేందనని స్పష్టం చేశారు. 
 
అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులను గమనిస్తున్న భారత్.. మనవాళ్లను తీసుకొచ్చేందుకు కాబూల్‌కు ఎయిరిండియా విమానాలను పంపింది. పలు దేశాల ప్రయాణీకులతో కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రద్దీగా మారింది. 
 
అప్ఘానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అప్ఘానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ అయింది. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్న సమయంలోనూ అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది.
 
అప్ఘానిస్తాన్‌లో పరిస్థితులను అంచనా వేయడంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విఫలమయ్యారు. అప్ఘాన్‌ సైన్యం చాలా బలంగా ఉందన్నారు. సైన్యాన్ని జయించడం అసాధ్యమని చెప్పారు. 3 లక్షల మంది సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చినా వారిని ఓడించడం ఆషామాషీ కాదంటూ ప్రకటించారు. బైడెన్ అంచనాలను తాలిబన్లు తలకిందులు చేశారు. బైడెన్ ప్రకటన చేసిన నెల రోజుల్లోనే.. అప్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకుని ప్రపంచాన్నే నివ్వెరపరిచారు. 
 
వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకుంది. తాలిబన్ల చేతుల్లోకి అప్ఘాన్ వెళ్లడంతో దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు అక్కడి జనమంతా ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలామంది తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. తమ పౌరులను అప్ఘాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం: స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు