Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగులు... 502 మంది ఎంపిక

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. నిమ్రా ఇం

Webdunia
మంగళవారం, 15 మే 2018 (21:23 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. 
 
జెన్ పాక్ట్, టాటా కేపిటల్, నొవాటెల్ గ్రూప్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, వరుణ్ మోటార్స్, అశోక్ లేలాండ్, కార్వే, ఫ్లిప్ కార్ట్ సహా 35 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలివిడతలో 502 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారని, మరో 246 మందిని షార్ట్ లిస్ట్ చేశారని వారికి కూడా త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రణయ్ అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments