వార ఫలాలు - 15-04-2018 నుంచి 21-04-2018వ తేదీ వరకు...
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఓర్పు, పట్టుదలతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్త
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఓర్పు, పట్టుదలతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆది, సోమవారాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రాజెక్టులు, నూతన వ్యాపారాలకు వనరులు సర్దుబాటవుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం అందుతుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. మంగళ, బుధవారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన వుండదు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. నోటిసులు, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. శనివారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వదు. బంధుత్వాలు, పరిచయాలు విస్తరిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం, వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనలో జయం, ధనలాభం ఉన్నాయి. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. రుణ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పదవుల కోసం చేసే యత్నాలు ఫలించవు. ఆది, సోమవారాల్లో కొంతమంది వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు నిదానంగా స్పందన లభిస్తుంది. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యాలకు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది వుండదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. మంగళ, బుధవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే సూచనలున్నాయి. మిత సంభాషణం శ్రేయస్కరం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాక 1, 2, 3 పాదాలు
స్వయంకృషితో రాణిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికస్థితి ఆశాజనకం. రుణ విముక్తులవుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు ఆశించవద్దు. పెట్టుబడులకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆది, గురువారాల్లో మొహమ్మాటాలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు అధికం, అవసరాలు నెరవేరుతాయి. మంగళ, శనివారాల్లో పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం వుంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఖర్చులు అంచనాలను పెంచుతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురు, శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. అవతలి వారి అభిప్రాయాలకు విలువ నివ్వండి. పెట్టుబడులకు సమయం కాదు. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ప్రియతముల కలయిక సంతోషాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి.
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన వస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహనయోగం వున్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. తొందరపడి చెల్లింపులు జరపకండి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
రాబడిపై దృష్టి సారిస్తారు. బాకీలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అరమరికలు తగవు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయం, వ్యాపకాలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల ప్రారంభంలో స్వల్ప ఆటంకాలెదురవుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆదాయం, ఖర్చులు సంతృప్తికరం. అయిన వారికి సాయం అందిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల తీరు బాధిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. సభలు, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు ఉల్లాసాన్నిస్తాయి.