Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉధృతం.. ఏప్రిల్ 6న పాదయాత్ర (Video)

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయించాయి. ఇందులోభాగంగా, ఈనెల 6వ తేదీన జాతీయ రహదారులపై పాదయాత్ర నిర్వహిస్తామన్నారు.

Advertiesment
ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉధృతం.. ఏప్రిల్ 6న పాదయాత్ర (Video)
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (15:10 IST)
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయించాయి. ఇందులోభాగంగా, ఈనెల 6వ తేదీన జాతీయ రహదారులపై పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధాన కూడళ్ళలో పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు. ఈ తొలిదశ పోరాటం పూర్తిగా శాంతియుత వాతావరణంలో సాగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
బుధవారం విజయవాడ వేదికగా సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధులతో కలిసి పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తమ ఉద్యమ కార్యాచరణపై మీడియాకు వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకపోవడం దారుణమన్నారు. సభా సజావుగా జరిగేలా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను విస్మరించిందని అన్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో 
 
ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీకి తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ, వైసీపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటున్నాయని విమర్శించారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అలాగే, ఇటీవల ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్ట సవరణ చేస్తోన్న నేపథ్యంలో నిర్వహించిన బంద్‌లో అంతమంది మృతి చెందడం, గాయాలపాలవడం బాధనిపించిందని, ఈ చర్యను తాము ఖండిస్తున్నామని అన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీపై కేంద్ర మంత్రి పాశ్వాన్ గుర్రు... ప్రభుత్వం తప్పు చేసింది