Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జె.డి.వచ్చెయ్.. కలిసి చేసుకుందాం... సిపిఐ రామక్రిష్ణ(Video)

తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న సిబిఐ మాజీ జె.డి.లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి చేరడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. తన రాజీనామాకు ఆమోదముద్ర మహారాష్ట్ర గవర్నర్ ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు లక్ష్మీనారాయణ. కానీ ఇంతలో ఆయన ఏ

జె.డి.వచ్చెయ్.. కలిసి చేసుకుందాం... సిపిఐ రామక్రిష్ణ(Video)
, సోమవారం, 2 ఏప్రియల్ 2018 (18:33 IST)
తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న సిబిఐ మాజీ జె.డి.లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి చేరడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. తన రాజీనామాకు ఆమోదముద్ర మహారాష్ట్ర గవర్నర్ ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు లక్ష్మీనారాయణ. కానీ ఇంతలో ఆయన ఏ పార్టీలో చేరుతారన్న దానిపై మాత్రం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఒకసారి జనసేన పార్టీ, మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇలా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆయన చేరుతున్నట్లు ప్రచారం మాత్రం తీవ్రస్థాయిలో జరుగుతోంది.
 
కానీ జె.డి.లక్ష్మీనారాయణను మాత్రం ఇంతవరకు ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి రాలేదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శ రామక్రిష్ణ జె.డి.లక్ష్మీనారాయణను సిపిఐ పార్టీలోకి ఆహ్వానించారు. నిజాయితీ కలిగిన వ్యక్తి.. సమాజంలో అన్నింటిపైన అవగాహన ఉన్న వ్యక్తి, అందులోను కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి లక్ష్మీనారాయణ కాబట్టి ఆయన సిపిఐ పార్టీలోకి రావాలని కోరారు. అలాంటి నాయకుడు ప్రజలకు అవసరమని, ప్రజా సమస్యలపై జె.డి.లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు సిపిఐ రామక్రిష్ణ. 
 
గతంలో జగన్, గాలిజనార్థన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిద్ర లేకుండా చేసి నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్నారు జె.డి.లక్ష్మీనారాయణ. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకోవడంతోనే ఆయన తన పదవికి రాజీనామా కూడా చేసినట్లు సన్నిహితులే చెబుతున్నారు. ఇప్పుడున్న పార్టీల కన్నా కమ్యూనిస్టులతో కలిస్తే ప్రజలకు సేవ చేయొచ్చొన్న ఆలోచనలో జె.డి.లక్ష్మీనారాయణ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జె.డి.లక్ష్మీనారాయణను సిపిఐలోకి ఆహ్వానించేందుకు నేతలు సిద్థంగా ఉన్నారు. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ సలాడ్‌లో బొద్దింక... రూ.87 లక్షలు డిమాండ్ చేసిన ప్రయాణికుడు