Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

సెల్వి
శనివారం, 29 మార్చి 2025 (09:44 IST)
వైకాపా నేతలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ నిర్మాణాలపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణం కూల్చేందుకు 15 రోజుల సమయం ఇస్తున్నానని, ఆ తర్వాత జేసీబీ తీసుకెళామని చెప్పారు.
 
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు. తాము తప్పు చేయకపోయినా వైకాపా హయాంలో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. వైకాపా నేతల తప్పులపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగు సెంట్ల మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారని, ఆ ఇల్లు కూల్చవద్దంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. 
 
అదేసమయంలో మాజీ మంత్రి విడదల రజనీపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పాపం మాజీ మంత్రి విడదల రజనీ ఎందుకు అంతలా బాధపడుతున్నారో తెలియడం లేదన్నారు. తప్పు చేస్తే జైలుకు వెళ్ళి రావమ్మా... ఏం ఫర్వాలేదు.. తాము కూడా గతంలో జైలుకు వెళ్లి వచ్చామని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments