Madhavi Latha, నటి, భాజపా నాయకురాలు మాధవీ లత ఈమధ్య వార్తల్లో వున్నారు. ఆమెపై తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరి ఆ వ్యాఖ్యలతోనో ఏమోగానీ ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తన బాధను ఆమె తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసారు. '' చాలా ప్రయత్నం చేశా, కానీ నేను మనిషినే… నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి… కున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. నా పార్టీ( ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను.
రూపాయి తీసుకున్నది లేదు. ఎవరికి ద్రోహం చేసింది లేదు, మోసం చేసింది లేదు, కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎపుడు నేను sympathy game ఆడలేదు women favor lawsని ఉపయోగించలేదు మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను, నాకు కుటుంబం, స్నేహితులు ఉన్నా సరే నా అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధని మీతో పంచుకున్నందుకు…. క్షమించండి. మీ ప్రేమ అభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి. మీ మాధవీలత'' అంటూ పోస్టు పెట్టి వీడియో కూడా జోడించారు.
మాధవీలతకు సారీ
సినీ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలతను ఉద్దేసించి టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. ఆవేశంలో అలా మాట్లాడానని, అందువల్ల ఆమెకు క్షమాపణలు చెపుతున్నట్టు చెప్పారు. జేసీ కాస్త తీవ్ర స్థాయిలో స్పందించి మాధవీలతను వ్యభిచారి అని సంబోధించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు.
మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, నోరు జారానని అంగీకరించారు. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని నోరు జారానని అంగీకరించారు. మాధవీలతకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
తాడిపత్రిలో మహిళల కోసం న్యూ ఇయర్ రోజున జేసీ పార్కులో సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, జేసీ పార్క్‌కు మహిళలు వెళ్లొద్దని, అక్కడి అరాచక శక్తుల వల్ల మహిళల అపాయం కలిగొచ్చని మాధవీలత వ్యాఖ్యానించారు. దాంతో జేసీ భగ్గుమన్నారు. మాధవీలతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.