Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపి భేటీకి జేసి బ్రదర్స్ డుమ్మా: బాలయ్య సైతం.. చంద్రబాబు ఆరా.....

Webdunia
సోమవారం, 1 జులై 2019 (14:28 IST)
ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటైన అనంతపురం జిల్లా నేతల సమావేశానికి జేసీ సోదరులు హాజరుకాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆదివారం తొలిసారి టీడీపీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 
 
జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి బికే పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, శమంతకమణి, మేయర్ స్వరూప, మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి, జతేంద్ర గౌడ్, యామినీ బాల, కందికుంట వెంకటప్రసాద్, ఈరన్నలు హాజరయ్యారు. పరిటాల శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. 
 
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరుకాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. 
 
హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యుడదు నిమ్మల కిష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు. బాలకృష్ణ కూడా సమావేశానికి రాలేదు. చంద్రబాబుతో కలిసి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినందున ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారు. అయితే, కొంత మంది నేతలు ఎందుకు డుమ్మా కౌట్టారనే విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. 
 
ధర్మవరం మాజీ శాసనసభ్యుడు గోనుగుంట్ల సూర్యనారాయణ బిజెపిలో చేరడంపై సమావేశంలో చర్చించారు. అక్కడ బలమైన నాయకుడిని ఇంచార్జీగా నియమించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments