Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటంకు ఆలివ్ గ్రీన్ టీషర్టు ధరించ రావడం వెనుక కారణం ఏంటి?

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (08:38 IST)
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పర్యటించారు. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్నో ప్రతిబంధకాలు సృష్టించారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కొంతదూరం కాలినడకన, మరికొంతదూరం కారులో ప్రయాణించి ఇప్పటం గ్రామస్థులను కూల్చివేశారు. అయితే, ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆలివ్ గ్రీన్ టీషర్టు, జీన్స్ ఫ్యాంటు ధరించి వచ్చారు. 
 
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ చర్యల్లో భాగంగా జనసేనకు మద్దతుగా నిలిచిన వారి గృహాలను అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉండేందుకు వీలుగా ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఆర్మీ స్టైల్‌లో ఆలివ్ గ్రీన్ హుండీ టీషర్టు, బ్లూ జీన్స్, షూ ధరించి ఇప్పటం గ్రామానికి వచ్చారు. 
 
అయితే, ఈ తరహా దుస్తులు ధరించి రావడానికి ప్రత్యేక కారణం ఉందని జనసేన పార్టీ వివరించింది. గూండాగిరి ప్రభుత్వంపై పోరాటానికి సూచికంగానే పవన్ మిలిటరీ ఆలివ్ గ్రీన్ టీషర్టు ధరించారని తెలిపింది. ఈ పోరాటంలో జనసేన ఓ సైనికుడిగా యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారని వివరించింది. ఇది సమాజాన్ని వచ్ఛిన్నం చేస్తున్న రౌడీ రాజకీయాలపై పోరాటం అని, ప్రజలను దోచుకుతింటూ, వారిని రోడ్డున పడేస్తున్న అవినీతి నాయకులపై పోరాటం అని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments