Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాక్షన్గ్ కింగ్ అర్జున్ వర్సెస్ వీశ్వక్ సేన్

Advertiesment
viswak sen pawn clap
, శనివారం, 5 నవంబరు 2022 (18:20 IST)
viswak sen pawn clap
యాక్షన్గ్ కింగ్ అర్జున్ తన కుమార్తె నాయికగా ఇటీవలే గ్రాండ్ గా ఆరంభించిన సినిమాలో వీశ్వక్ సేన్ సహకరించడం లేదని అర్జున్ ఆవేదన చెందారు. అందుకే సినిమా చేయడం లేదని ఫిలిం ఛాంబర్, హైదరాబాద్ లో అర్జున్ తెలిపారు. కొన్ని సైట్స్ లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తెలీదు. నా కూతుర్ని తెలుగు ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను.
 
నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా బాగా నచ్చింది అని చెప్పాడు. తరువాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది.  నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు. కేరళ లో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు.  ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు అయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. 
 
సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు.  అల్లు అర్జున్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు వాళ్లకు  ఏమి తక్కువ.  మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెపుతున్నాను.  ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో వుంది. నేను ఇలాంటి వాతావరణంలో నేను సినిమా చెయ్యడం లేదు అని చెపుతున్నాను.
ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను అని అర్జున్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారేడుమిల్లి ప్రజానీకం కోసం అల్లరి నరేష్ పాట్లు, విడుదల తేదీ మార్పు